న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
- నార్త్ ఐలాండ్ ను కుదిపేసిన భూకంపం
- రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రత
- వేకువజామున సునామీ మొదటి అల వస్తుందన్న అధికారులు
- తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరిక
కాగా, భూకంప కేంద్రం గిస్బోర్న్ నగరానికి సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడికి సమీపంలోని కేప్ రనవే, టొలాగా బే ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం వేకువజామున 3.34 గంటలకు సునామీ మొదటి అల విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. సునామీ ప్రభావం కొన్ని గంటల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.