తమిళనాడులో తాజా షెడ్యూలు పూర్తిచేసిన 'పుష్ప'
- అల్లు అర్జున్, రష్మిక జంటగా 'పుష్ప'
- ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ
- తెన్ కాశీలో ముగిసిన తాజా షెడ్యూలు
- సీన్స్, పాట, యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
ఈ క్రమంలో తాజా షెడ్యూలు షూటింగును తమిళనాడులోని తెన్ కాశీ పరిసరాలలో నిర్వహించారు. తాజాగా ఈ షెడ్యూలు పూర్తవడంతో చిత్రం యూనిట్ అక్కడి నుంచి బయలుదేరింది. ఈ షెడ్యూలులో కీలక సన్నివేశాలు,యాక్షన్ ఎపిసోడ్, ఓ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక గ్రామీణ యువతి పాత్రను పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రాన్ని ఆగస్టు 13న రిలీజ్ చేస్తారు.