సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'ఆచార్య' షూటింగులో పూజ హెగ్డే
- వెరైటీ ప్రేమకథలో హాస్యనటి శ్రీలక్ష్మి
- 'శాకుంతలం'కి నో చెప్పిన ఈషా రెబ్బ
* నిన్నటితరం ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి, యువనటుడు పార్వతీశం జంటగా నటిస్తున్న 'సావిత్రి W/O సత్యమూర్తి' చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది. అరవై ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడిన పాతికేళ్ల కుర్రాడి కథగా ఇది తెరకెక్కుతోందని చిత్ర దర్శకుడు చైతన్య కొండ తెలిపారు. 45 రోజుల్లో షూటింగును పూర్తిచేస్తామని చెప్పారు.
* సమంత ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న 'శాకుంతలం' చిత్రంలో కీలక పాత్రకు ఈషా రెబ్బాను తీసుకున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, పారితోషికం కారణంగా ఈషా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని తెలుస్తోంది.