పోస్టుమార్టం చేయబోతుండగా బతికాడు... కర్ణాటకలో ఘటన!
- రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు
- ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
- చనిపోయాడంటూ వెంటిలేటర్ తొలగించిన వైద్యులు
- పోస్టుమార్టం కోసం దేహం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
- యువకుడి శరీరంలో కదలికలు గుర్తించిన బంధువులు
ఇక, అతడి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం ప్రారంభించబోతుండగా ఆ యువకుడి దేహంలో కదలిక కనిపించింది. ఇది గమనించిన ఆ యువకుడి బంధువులు వైద్యులకు ఈ విషయం తెలిపారు. దాంతో అతడిని హుటాహుటీన మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నట్టు తెలిసింది.
దీనిపై ప్రభుత్వాసుపత్రి వర్గాలు స్పందిస్తూ, ఆ యువకుడికి మొదట చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు తప్పుడు నిర్ణయం వెలిబుచ్చారని, బతికున్నవాడికి వెంటిలేటర్ తీసేసి చనిపోయాడని చెప్పారని పేర్కొన్నారు.