భానుప్రకాశ్ పై చేయి పడితే ఫాంహౌస్ పై చేయి వేయాల్సి ఉంటుంది: బండి సంజయ్
- ఉద్యోగాల భర్తీ కోరుతూ బీజేవైఎం మెరుపు ధర్నా
- బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాశ్ అరెస్ట్
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్
- లాలూ, కరుణానిధిలకు ఏం జరిగిందో కేసీఆర్ గుర్తుచేసుకోవాలని సూచన
తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ టీఎస్ పీఎస్ సీ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భానుప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.