విరాట్ కోహ్లీ ఖాతాలో 'సోషల్' రికార్డు
- కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్ లో 100 మిలియన్ ఫాలోవర్లు
- భారత్ లో ఒకే ఒక్కడిగా కోహ్లీ ఘనత
- అంతర్జాతీయ స్థాయిలో నాలుగో స్థానం
- కోహ్లీ కంటే ముందు రొనాల్డో, మెస్సీ, నేమార్
- ఇన్ స్టాగ్రామ్ ద్వారా భారీగా ఆదాయం పొందుతున్న కోహ్లీ
కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు చేస్తే భారీ మొత్తంలో పారితోషికం ముడుతుందన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆదాయం పొందే క్రీడాకారుల టాప్-10 జాబితాలో ఉన్న ఒకే ఒక క్రికెటర్ విరాట్ కోహ్లీ. అంతేకాదు, దేశంలో బ్రాండ్ వాల్యూ పరంగానూ ఇతర రంగాల సెలబ్రిటీలను వెనక్కినెట్టిన ఈ క్రికెట్ వీరుడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కాగా, సోషల్ మీడియాలో కోహ్లీ ప్రభంజనంపై ఐసీసీ కూడా స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ లో 100 మిలియన్ల ఫాలోవర్లను పొందిన మొట్టమొదటి క్రికెటర్ అని కొనియాడింది.