ప్రతిపక్ష నేత ఇంటికి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు: సీఎం జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం
- చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
- ఎయిర్ పోర్టులో అడ్డుకున్న పోలీసులు
- పిరికి పాలకుడు జగన్ అంటూ విమర్శలు
- ఈ అరాచకాలు ఇంకెన్నాళ్లని మండిపాటు
- జగన్ రెడ్డి పతనానికి నాంది అంటూ వ్యాఖ్యలు
"ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లవుతాయి" అని హెచ్చరించారు. డెమోక్రసీని జగనోక్రసీతో అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నేత హక్కులు హరిస్తున్న ప్రతి సంఘటన జగన్ రెడ్డి పతనానికి నాంది కాబోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పష్టం చేశారు.