సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం కుంట శ్రీను, చిరంజీవిలను సుందిళ్ల బ్యారేజి వద్దకు తీసుకెళ్లిన పోలీసులు!
- ఇటీవల పెద్దపల్లి జిల్లాలో వామనరావు దంపతుల హత్య
- కత్తులు, వేటకొడవళ్లతో విచక్షణ రహితంగా దాడి
- హత్య తర్వాత ఆయుధాలను సుందిళ్ల బ్యారేజిలో పడేసిన నిందితులు
- భారీ బందోబస్తుతో నిందితులను సుందిళ్ల తీసుకొచ్చిన పోలీసులు
దాంతో, పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం కుంట శ్రీను, చిరంజీవిలను ఈ మధ్యాహ్నం సుందిళ్ల బ్యారేజి వద్దకు తీసుకువచ్చారు. కత్తులను, వేట కొడవళ్లను ఎక్కడ విసిరేశారంటూ వారిని విచారించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నడుమ నిందితులిద్దరినీ తీసుకువచ్చారు. ఇద్దరికీ కలిపి బేడీలు వేశారు.