ముఖేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు... అప్రమత్తమైన పోలీసులు
- స్కార్పియో వాహనంలో పేలుడు పదార్థాలు
- గుర్తించిన అంబానీ సెక్యూరిటీ సిబ్బంది
- పోలీసులకు సమాచారం అందించిన వైనం
- హుటాహుటీన వచ్చిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు
- వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయన్న మహారాష్ట్ర హోంమంత్రి
దీనిపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పందిస్తూ, ఆ వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్టు తేలిందని వెల్లడించారు. దీనిపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాగా, ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్ చేశారన్నదానిపై పోలీసులు అక్కడి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించనున్నారు.