'ఉప్పెన' టీమ్ కు మెగా కానుక విలువ ఎంతంటే...!
- ఈ నెల 12న రిలీజైన ఉప్పెన
- హీరోగా నటించిన చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్
- ఉప్పెన విజయంతో చిరంజీవి ఆనందం
- చిత్రబృందానికి సందేశంతో పాటు ఓ బొమ్మను పంపిన వైనం
- బొమ్మ ఖరీదు రూ.83 వేలు!
చిరు రూ.83 వేల విలువ చేసే ఓ ప్రేమికుల బొమ్మను చిత్రయూనిట్ కు పంపారు. ఈ బొమ్మ పేరు 'ది థ్రిల్ ఆఫ్ లవ్ కపుల్ ఫిగరైన్'. దీన్ని స్పానిష్ సంస్థ లాడ్రో రూపొందించింది. ఈ బొమ్మలో ఓ యువతి, యువకుడు ప్రేమభావనతో ఒకర్నొకరు హత్తుకుని ఉంటారు. చిరంజీవి తన సందేశంతో పాటు ఈ బొమ్మను కూడా పంపి చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు.