ఎముకలు విరగ్గొడతా... మధ్యప్రదేశ్ మాజీ మంత్రిపై కంగనా రనౌత్ ఆగ్రహం!
- కంగనాను రికార్డింగ్ డ్యాన్సర్ గా అభివర్ణించిన సుఖ్ దేవ్
- ఐటమ్ సాంగ్స్ చేయని ఏకైక హీరోయిన్ ను నేనే
- రాజపుత్ మహిళనని గుర్తు చేసిన కంగన
ఇటీవల మీడియాతో మాట్లాడిన సుఖ్ దేవ్, కంగన గురించి మాట్లాడుతూ, ఆమె ఓ రికార్డింగ్ డ్యాన్సర్ అనే మీనింగ్ వచ్చేలా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో కంగన స్పందించారు. తానేమీ ఆలియా భట్, దీపికా వంటి హీరోయిన్ ను కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకూ ఏ సినిమాలోనూ ఐటమ్ సాంగ్స్ చేయలేదని, ఐటమ్ సాంగ్స్ చేయని ఏకైక హీరోయిన్ ను తానేనని అన్నారు.
గతంలో ఎన్నో పెద్ద పెద్ద హీరోల సినిమాలను కూడా వద్దనుకున్నానని, అందుకనే బాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లు, ఇతర నటీ నటులు తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.