సోము వీర్రాజుపై కొడాలి నాని సెటైర్లు
- స్టీల్ ప్లాంటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై వీర్రాజు వ్యాఖ్యలు హాస్యాస్పదం
- ఆయన మాటలను ఆ పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోరు
- ప్రైవేటుపరం చేయడం లేదని కేంద్రంతో ఒక ప్రకటన ఇప్పించాలి
అంతకు ముందు సోము వీర్రాజు మాట్లాడుతూ ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ, టీడీపీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీతో చేతులు కలిపి బీజేపీని ఏకాకిని చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఒక ప్రకటన కూడా చేయలేదని... అలాంటప్పుడు ఉద్యమం ఎందుకని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు వ్యాఖ్యలపై కొడాలి నాని మండిపడ్డారు.