అరుణగ్రహంపై అమెరికా రోవర్... రెండు ఫొటోలతో పని ప్రారంభం
- పర్సెవరెన్స్ రోవర్ ను ప్రయోగించిన నాసా
- అంగారకుడిపై విజయవంతంగా ల్యాండింగ్
- ఫొటోలను గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ కు పంపిన రోవర్
- నాసా శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకం
- రెండేళ్లపాటు పరిశోధనలు సాగించనున్న పర్సెవరెన్స్
ప్రస్తుతం పర్సెవరెన్స్ రోవర్ ల్యాండైన జెజేరో బిలం ఉన్న ప్రాంతంలో వందల కోట్ల సంవత్సరాల కిందట ఓ సరస్సు ఉండి ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోవర్ విజయవంతంగా దిగడం పట్ల నాసా శాస్త్రవేత్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాలిఫోర్నియాలోని పసడెనా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ లో ఆనందం మిన్నంటింది. కాగా, ఈ రోవర్ అంగారకుడి ఉపరితలంపై రెండేళ్లపాటు పరిశోధనలు సాగించనుంది. ఇక్కడ జీవజాలం మనుగడకు అవకాశం ఉందా? అనే అంశాన్ని పర్సెవరెన్స్ విశ్లేషించనుంది.