గాల్వన్ ఘర్షణకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన చైనా!
- గత ఏడాది గాల్వన్లో ఘటన
- భారత సైనికులను వెనక్కివెళ్లమన్న చైనా
- దీటుగా సమాధానం ఇచ్చిన భారత్
భారత సైన్యంతో చైనా సైనికులు వాగ్వివాదానికి దిగడం ఇందులో చూడవచ్చు. సరిహద్దుల వద్ద ఉండొద్దంటూ చైనా సైనికులు వితండవాదం చేశారు. అయితే, భారత భద్రతా బలగాలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చైనా సైనికుల మాటలకు మాటలతోనే దీటుగా సమాధానం ఇచ్చారు. అనంతరం కూడా గాల్వన్ లో చైనా సైనికులు దుందుడుకు చర్యలకు పాల్పడితే వారి చేతలకు చేతలతోనే భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది.