కేజ్రీవాల్ కూతురుని మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్
- సోఫాను ఆన్ లైన్లో అమ్మేందుకు యత్నించిన హర్షిత
- దానిని కొంటానని ముందుకొచ్చిన ఓ వ్యక్తి
- ముందుగా చిన్న మొత్తం ఆమె అకౌంటుకు బదిలీ
- బార్ కోడ్ స్కాన్ చేయమని కోరిన కేటుగాడు
- ఆమె అకౌంట్ నుంచి రూ.34 వేలు కొట్టేసిన వైనం
మోసం ఎలా చేశారనే వివరాల్లోకి వెళ్తే... సోఫాను అమ్ముతున్నట్టు ఆన్ లైన్లో హర్షిత పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో, తనను తాను కస్టమర్ గా పేర్కొన్న ఓ వ్యక్తి... చిన్న మొత్తాన్ని ఆమె అకౌంట్ కు బదిలీ చేస్తూ, బార్ కోడ్ ను స్కాన్ చేయాలని కోరాడు. అతని మాటలను నమ్మిన హర్షిత బార్ కోడ్ ను స్కాన్ చేశారు. ఆ తర్వాత ఆమె అకౌంట్ నుంచి రెండు విడతలుగా రూ. 20 వేలు, రూ. 14 వేలను కొట్టేశారు. ఈ మోసంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.