Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో మ‌రింత పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు!

Petrol Diesel Price in Hyderabad
  • పెట్రోల్ ధర లీట‌రుకు 23 నుంచి 26 పైసల మ‌ధ్య పెంపు
  • డీజిల్ ధ‌ర‌ 28 నుంచి 30 పైసల మ‌ధ్య పెరుగుద‌ల‌
  • హైదరాబాద్‌లో లీట‌రు పెట్రోల్ రూ. 92.53, డీజిల్ రూ.86.55
  • అమరావతిలో లీట‌రు పెట్రోల్ రూ. 95.13, డీజిల్ రూ. 88.63
దేశంలో చ‌మురు ధ‌ర‌లు వ‌ర‌స‌గా ఏడో రోజు పెరిగాయి. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే లీట‌రు పెట్రోలు రూ.90 దాటింది. ఈ రోజు పెట్రోల్ ధర లీట‌రుకు 23 నుంచి 26 పైసల మ‌ధ్య‌, డీజిల్ ధ‌ర‌ 28 నుంచి 30 పైసల మ‌ధ్య పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధర రూ.88.73,  డీజిల్ ధ‌ర‌ లీటరుకు రూ.79.35కి చేరింది.

గత ఏడు రోజుల్లో పెట్రోల్ ధర రూ.2.06, డీజిల్ రూ.2.56 పెర‌గ‌డం గ‌మ‌నార్హం. హైదరాబాద్‌లో లీట‌రు పెట్రోల్ రూ. 92.53, డీజిల్ రూ.86.55గా ఉంది. అమరావతిలో లీట‌రు పెట్రోల్ రూ. 95.13, డీజిల్ రూ. 88.63కి చేరాయి. ఇక‌, ముంబైలో లీట‌రు పెట్రోలు‌ రూ .95.46, డీజిల్ రూ.86.34గా ఉంది. కోల్‌కతాలో లీట‌రు పెట్రోల్  రూ. 90.25, డీజిల్ రూ.82.94కి చేర‌గా, చెన్నైలో  లీట‌రు పెట్రోల్ రూ.91.19, డీజిల్ రూ.84.44కి పెరిగింది.
petrol
diesel
Hyderabad

More Telugu News