చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వ టెండర్లా? అని మోదీ ఆశ్చర్యపోయారు: రఘురామకృష్ణరాజు
- ఈరోజు మోదీని కలిసిన రఘురాజు
- చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందని మోదీకి చెప్పిన రఘురాజు
- పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రధాని అడిగారన్న రఘురాజు
తాను చెప్పిన అన్ని విషయాలను సావధానంగా విన్న మోదీ... ఒక విషయంలో మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. ఏపీలో చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచిందని చెప్పగానే ప్రధాని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని అన్నారు. చర్చిల నిర్మాణానికి టెండర్లా? అని ప్రశ్నించారని చెప్పారు. ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని అన్నారని తెలిపారు. టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వమని అడిగారని చెప్పారు.