ఎంపీలందరితో కలిసి సీఎం జగన్ ప్రధానిని కలవాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ఎందరో ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటయింది
- ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- ఈ అంశంపై జగన్ కూడా దృష్టి సారించాలి
విశాఖ ప్లాంట్ నుంచి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో స్థానిక ప్రజలు సెంటిమెంటల్ గా కనెక్ట్ అయ్యారని... ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. వైసీపీ ఎంపీలందరితో కలిసి ప్రధాని మోదీని జగన్ కలవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ అంశంపై పోరాడితే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.