యముడి వేషంలో వచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పోలీసు
- దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోనూ వ్యాక్సిన్ ప్రక్రియ
- యమధర్మరాజు వేషం వేసిన కానిస్టేబుల్ జవహర్ సింగ్
- అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించడం కోసమేనని వెల్లడి
దీనిపై జవహర్ సింగ్ మాట్లాడుతూ, కరోనా పోరాట యోధులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించేందుకు యముడి వేషం వేశానని తెలిపాడు. గత ఏడాది ఏప్రిల్ లోనూ కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సింగ్ యముడి వేషం వేసి ఇండోర్ నగర వీధుల్లోకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోలీసు కానిస్టేబుల్ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.