హైదరాబాద్ మేయర్ గా గద్వాల విజయలక్మి.. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత ఎన్నిక!
- టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి
- బంజారాహిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన విజయలక్ష్మి
- తార్నాక నుంచి గెలుపొందిన శ్రీలత
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపిన విషయం తెలిసిందే. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని రీతిలో అధిక స్థానాల్లో గెలుపొందడం, ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో దీనిపై కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలిపింది. చివరికి టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.