Corona Virus: దేశంలో కొత్త‌గా 9,110 మందికి కరోనా

India reports 9110 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,47,304
  • మృతుల సంఖ్య 1,55,158
  • కోలుకున్న వారు 1,05,48,521  మంది
  • 62,59,008 మందికి వ్యాక్సిన్  
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 9,110 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,016 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,158 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,48,521 మంది కోలుకున్నారు. 1,43,625 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 62,59,008 మందికి వ్యాక్సిన్ వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,25,87,752  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,87,138 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News

Corona Virus
COVID19
India