Corona Virus: దేశంలో కొత్త‌గా 11,831 మందికి కరోనా

India reports 11831 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194
  • మృతుల సంఖ్య 1,55,080
  • కోలుకున్న వారు 1,05,34,505 మంది
  • 58,12,362 మందికి వ్యాక్సిన్  
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11,831 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,904 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 84 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,080 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,34,505  మంది కోలుకున్నారు. 1,48,609 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 58,12,362 మందికి వ్యాక్సిన్ వేశారు.
        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,19,00,614 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,32,236 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News

Corona Virus
COVID19
India