టీమిండియా వికెట్ కీపర్ పంత్ చిరునవ్వుపై మనసు పారేసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ యాంకర్
- సూపర్ ఫామ్ లో ఉన్న పంత్
- ఇంగ్లండ్ పై 91 పరుగులు
- ఆడుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాడన్న క్లో అమందా బెయిలీ
- ఆ నవ్వు తనను కట్టిపడేస్తోందని వ్యాఖ్యలు
రిషబ్ పంత్ కేవలం 40 బంతుల్లోనే 50 పరుగులు చేశాడని, అయితే ఎక్కడా అడ్డదిడ్డంగా షాట్లు ఆడలేదని కొనియాడింది. భయమన్నది లేకుండా ఆడిన పంత్, క్రీజులో ఉన్నంత సేపు చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడని, ఆ నవ్వు తనను కట్టిపడేస్తోందని క్లో అమంతా బెయిలీ వెల్లడించింది. ఇవాళ పంత్ సెంచరీ సాధిస్తాడని భావించానని, ఇవాళ కూడా సిడ్నీ తరహాలోనే అవుటయ్యాడని, సిడ్నీలో 97 పరుగుల వద్ద పంత్ అవుట్ కావడం తనకింకా గుర్తుందని తెలిపింది. చెన్నైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన సంగతి తెలిసిందే.