నేడు దేశవ్యాప్తంగా రైతుల రాస్తా రోకో.. మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధం
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా 72 రోజులుగా రైతుల ఆందోళన
- ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా రాస్తారోకో
- మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు ముగియనున్న నిరసన
మరోవైపు, తాము జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలను మాత్రమే దిగ్బంధిస్తామని, స్కూలు బస్సులు, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలను అడ్డుకోబోమని 41 యూనియన్ల రైతు సమైక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. మూడు గంటలకు రాస్తారోకో ముగిసే సమయంలో వాహనాల హారన్లను ఓసారి మోగించాలని సూచించింది.