Sathyanandam: తాను అడిగినంత ఇస్తే ప్రధాని మోదీని హత్య చేస్తానన్న వ్యక్తి అరెస్ట్

Man arrested who announced to kill PM Modi
షార్ట్స్‌లో చూడండి
పుదుచ్చేరికి చెందిన సత్యానందం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అర్యణ్ కుప్పం గ్రామవాసి అయిన సత్యానందం ఇటీవల ఫేస్ బుక్ లో విపరీత వ్యాఖ్యలు చేశాడు. తాను అడిగినంత ఇస్తే ప్రధాని మోదీని చంపేస్తానని పోస్టు పెట్టాడు. ఎవరైనా రూ.5 కోట్లు ఇస్తే మోదీని హత్య చేస్తానని ప్రకటించాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యానందంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యానందంను గుర్తించి అరెస్ట్ చేశారు. సత్య సత్య అనే ఫేస్ బుక్ ఖాతాలో అతడు ఈ వ్యాఖ్యలు చేసినట్టు గుర్తించారు. అతడిపై పలు సెక్షన్లు మోపి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. పోలీసులు ఓ ట్యాక్సీ డ్రైవర్ సాయంతో సత్యానందం ఆచూకీ గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Sathyanandam
Narendra Modi
Murder
Puducherry
BJP
Police

More Telugu News