ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు విమానం... గోఎయిర్ కొత్త సర్వీసు

GoAir direct flight between Hyderabad and Male
  • బడ్జెట్ ధరల ఎయిర్ లైన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న గోఎయిర్
  • మాలే నగరానికి తొలి డైరెక్ట్ సర్వీసు
  • వారానికి నాలుగు రోజుల పాటు సర్వీసులు
  • ఈ రూట్లో ఎయిర్ బస్ విమానాన్ని వినియోగించాలని నిర్ణయం
మధ్యస్థ ధరల విమానయాన సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న గోఎయిర్ తాజాగా హైదరాబాదు నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి హైదరాబాద్ నుంచి మాల్దీవుల రాజధాని మాలే నగరానికి విమానం నడపనుంది. ఈ రెండు నగరాల మధ్య ఇదే తొలి డైరెక్ట్ విమాన సర్వీసు. ఈ విమాన సర్వీసు వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. సోమవారం, మంగళవారం, గురువారం, ఆదివారం హైదరాబాద్-మాలే విమాన సర్వీసును తిప్పనున్నారు.

గోఎయిర్ ఈ రూట్లో తన ఎయిర్ బస్ ఏ320 నియో విమానాన్ని నడపనుంది. ఉదయం 11.30 గంటలకు హైదరాబాదులో బయల్దేరే ఈ విమానం మాలే కాలమానం ప్రకారం 1.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు మాలేలో బయల్దేరి 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
Go Back to Shorts
GoAir
Hyderabad
Male
Direct Flight
Maldives

More Telugu News