2014లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు
- 2014 ఎన్నికల్లో జాతీయ రహదారిపై ఎన్నికల ప్రచారం
- కోదాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- కేసులో ఏ1 నిందితుడిగా జగన్
- ఈ నెల 12న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశం
అప్పట్లో జగన్‌పై కోదాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో జగన్ ఏ1 నిందితుడు కాగా, ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.