కేంద్రం విజ్ఞప్తి మేరకు 250 ఖాతాలను నిలిపివేసిన ట్విట్టర్
- రైతుల వధకు మోదీ పన్నాగం అంటూ హ్యాష్ ట్యాగ్ వైరల్
- రైతు ఉద్యమం నేపథ్యంలో ఫేక్ అకౌంట్లు
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న కేంద్రం
- ట్విట్టర్ కు సమాచారం అందించిన కేంద్రం
దీనిపై ట్విట్టర్ వర్గాలు స్పందించాయి. ప్రతిచోట ప్రజలకు సేవలు అందించే క్రమంలో, ఏ ప్రాంతంలోనైనా అధికార యంత్రాంగం నుంచి ఫిర్యాదులు వస్తే అభ్యంతరకరమైన కంటెంట్ ను నిలుపుదల చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశాయి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడడంలో పారదర్శకత ఎంతో కీలకం అని ట్విట్టర్ ఓ ప్రకటనలో పేర్కొంది.