ప్రభాస్ తల్లి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి!
- ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
- రామాయణం ఆధారంగా సినిమా
- రాముడిగా ప్రభాస్.. లంకేశ్ గా సైఫ్
- కౌసల్య పాత్రలో హేమమాలిని
ఇక ఇందులో శ్రీరాముడి తల్లి కౌసల్య పాత్రకు గాను ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలినిని తాజాగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల చిత్ర బృందం ఆమెను సంప్రదించగా.. ఈ పాత్ర చేయడానికి ఆమె వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా, మరో ముఖ్య పాత్ర అయిన సీత పాత్రకు కృతి సనన్ ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నప్పటికీ, ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.
ఈ చిత్రంలో ఎస్ఎఫ్ఎక్స్ పనులకు బాగా ప్రాధాన్యం ఉందట. దాంతో హాలీవుడ్ సాంకేతిక నిపుణులను కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాణ పనులు ముంబైలో మొదలయ్యాయి.