పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్రానికి మద్దతిస్తాం: కేకే
- రాష్ట్ర ప్రయోజనాలకు అవరోధంగా నిలిచే పనులను ఎప్పుడూ చేయం
- రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
- రాష్ట్రం కోసం ఎవరితో స్నేహం చేయడానికైనా సిద్ధమే
ఢిల్లీలో ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశానికి 18 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ చట్టాలకు సంబంధించిన అంశాన్ని పలు పార్టీలు లేవనెత్తాయి. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేకే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. రైతు చట్టాలను తాము వ్యతిరేకించామని తెలిపారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన ఘటనలు సరికాదని తెలిపారు. ఈ ఘటనను సాకుగా చూపి రైతుల సమస్యలను విస్మరించకూడదని చెప్పారు.