ఇసుక‌ మాఫియా గ‌న్‌లతో వ‌చ్చి రెచ్చిపోయింది: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్‌

lokesh slams jagan
  • ఆంధ్రప్రదేశ్ ని బీహార్ లా మార్చేశాడు  జ‌గ‌న్
  • పచ్చనిసీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్ష‌న్ సీమగా చేశారు
  • లంక‌ల గ‌న్న‌వ‌రంలో ఇసుక మాఫియా ఆగ‌డాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇసుక మాఫియా గ‌న్‌తో వ‌చ్చి రెచ్చిపోయిందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

'ఆంధ్రప్రదేశ్ ని బీహార్ లా మార్చేశాడు వైఎస్ జ‌గ‌న్.  నాడు-నేడు స్కీంలో భాగంగా నాడు పచ్చనిసీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్ష‌న్ సీమగా చేశారు. గన్ రాకముందే జగన్ వస్తాడని గాలి కబుర్లు చెప్పారు.

ఇప్పుడు రివర్స్ లో జ‌గ‌న్ రెడ్డి కంటే ముందు ఆయ‌న పెంచిపోషిస్తోన్న ఇసుక‌ మాఫియా గ‌న్‌లతో వ‌చ్చి తూర్పుగోదావరి జిల్లా, లంక‌ల గ‌న్న‌వ‌రంలో రెచ్చిపోయింది. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు, ఇసుకని బంగారం చేశారు, ఇప్పుడు గన్నులు పట్టుకొని ప్రజలపై పడ్డారు వైకాపా ఇసుకాసురులు. స్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు, ప్రజల ప్రాణాలు తీస్తారు' అని లోకేశ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP
Viral Videos

More Telugu News