రామగుండం కమిషనరేట్‌కు వచ్చి సీపీని క‌లిసిన ప్ర‌భాస్.. చూసేందుకు భారీగా వ‌చ్చిన జ‌నం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామగుండం కమిషనరేట్‌కు వచ్చి సీపీని క‌లిసిన ప్ర‌భాస్.. చూసేందుకు భారీగా వ‌చ్చిన జ‌నం

prabhas meets ramagundam cp
  • పాన్ ఇండియా సినిమా సలార్ లో న‌టిస్తోన్న ప్ర‌భాస్‌
  • గోదావరి ఖనిలో సినిమా షూటింగ్
  • మ‌ర్యాద పూర్వ‌కంగా సీపీని క‌లిసి హీరో
బాహుబ‌లి, సాహో వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ త‌ర్వాత యంగ్ హీరో ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మ‌రో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమా సలార్ లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  గోదావరి ఖనిలో ఈ సినిమా షూటింగ్ కోసం ప్ర‌భాస్ వెళ్లాడు.   ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు.

ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్న‌ ప్రభాస్  రామగుండం కమిషనరేట్‌కు వచ్చి ఆ ప్రాంత‌ సీపీ సత్యనారాయణను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ప్రభాస్‌కు సీపీ సత్యనారాయణ త‌మ‌ సిబ్బందిని పరిచయం చేశారు. ‌ సీపీ కార్యాలయానికి ప్ర‌భాస్‌ రావడంతో ఆయనను చూసేందుకు అక్క‌డ‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

ప్రస్తుతం  రామగిరి మండలంలో ప‌ది రోజుల షెడ్యూల్‌లో భాగంగా ఓసీపీ-2లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇందుకోసం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద భారీ సెట్టింగ్‌ వేశారు. సింగరేణి అతిథి గృహాల్లోనే సినీ యూనిట్ స‌భ్యులు ఉంటున్న‌ట్లు తెలిసింది.
Prabhas
Tollywood
cp

More Telugu News