Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

India reports 18855 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 18,855 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 20,746 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,20,048 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 163 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,010 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,94,352  మంది కోలుకున్నారు. 1,71,686  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 29,28,053 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,50,81,079 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,42,306 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News