బాడీగార్డును పెళ్లి చేసుకున్న శృంగార తార పమేలా అండర్సన్
- ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకున్న పమేలా
- బాడీగార్డ్ ను ఆరో పెళ్లి చేసుకున్న వైనం
- లాక్ డౌన్ సమయంలో పెళ్లాడినట్టు వెల్లడి
కరోనా లాక్ డౌన్ సమయంలో కెనడాలోని తన ఐలాండ్ లో హేహర్స్ట్ ను వివాహం చేసుకున్నట్టు పమేలా వెల్లడించింది. ఇది ఆమెకు ఆరో వివాహం కావడం గమనార్హం. తన భర్త హేహర్స్ట్ తో ఉన్న పెళ్లి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేసింది. సోషల్ మీడియాకు తాను దూరంగా ఉండాలనుకుంటున్నానని... ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను తొలగించబోతున్నట్టు చెప్పింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.