RRR: దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు 'ఆర్ఆర్ఆర్'... అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటన!

RRR release date announced by unit
షార్ట్స్‌లో చూడండి
అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాలు మోసుకువస్తున్న ఈ చిత్రం దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నీరు, నిప్పు కలిసి ఓ శక్తిలా మారితే ఎలా ఉంటుందో ఈ ఏడాది అక్టోబరు 13న చూస్తారంటూ చిత్రబృందం రిలీజ్ డేట్ ప్రకటించింది.

ఇలాంటి ఉత్పాతాన్ని మునుపెన్నడూ చూసి ఉండరని పేర్కొంది. భారత సినిమా చరిత్రలో అతి పెద్ద భాగస్వామ్యంతో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక స్వారీ షురూ అంటూ పేర్కొన్నారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Go Back to Shorts
RRR
October 13th
Release
Rajamouli
Ramcharan
Junior NTR

More Telugu News