తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
- కుటుంబ సభ్యులతో కలిసి తమిళిసై పుణ్యక్షేత్రాల సందర్శన
- నిన్న రేణిగుంట చేరుకున్న తెలంగాణ గవర్నర్
- ఈ ఉదయం తిరుమల వెంకన్న దర్శనం
- ఆపై తిరుచానూరులో పూజలు
అమ్మవారి దర్శనం అనంతరం ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె తిరుపతిలో ఎస్వీ వైద్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళతారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా తమిళిసై నిన్న రేణిగుంట చేరుకున్నారు. తొలుత కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని దర్శించుకుని ఆపై తిరుమల వెళ్లారు.