Corona Virus: దేశంలో కొత్త‌గా 14,849 మందికి కరోనా నిర్ధారణ

  India reports 14849  new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 14,849 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 15,948 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 155 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,339 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,16,786 మంది కోలుకున్నారు. 1,84,408 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 15,82,201 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,17,66,871 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,81,752 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News