నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం
- అంగడిపేట వద్ద లారీని ఢీకొన్న ఆటో
- డ్రైవర్, ఐదుగురు మహిళల మృతి
- వరినాట్లు వేసి వస్తుండగా ప్రమాదం
- ప్రమాద సమయంలో ఆటోలో 21 మంది!
- సుద్దబావి తండాలో విషాదం
ఆటోలో ప్రయాణిస్తున్నవారిని సుద్దబావి తండాకు చెందినవారిగా గుర్తించారు. వీరు వరినాట్ల నిమిత్తం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఓ బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో చెన్నంపేట మండలం సుద్దబావి తండా శోకసంద్రాన్ని తలపిస్తోంది.