శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పోతుల సునీత
- తాను ఖాళీ చేసిన స్థానానికి తానే నామినేషన్ దాఖలు
- కొన్నాళ్ల కిందట టీడీపీని వీడి వైసీపీలో చేరిన సునీత
- టీడీపీలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ అవకాశం
- పదవికి రాజీనామా
- ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్
- సునీతకే అవకాశం ఇచ్చిన సీఎం జగన్
పోతుల సునీత కొంతకాలం కిందట టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు సునీతకు చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. పదవి నుంచి ఆమె తప్పుకోవడంతో శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీనిపై నోటిఫికేషన్ విడుదల కావడంతో వైసీపీ తరఫున పోతుల సునీతకే అవకాశం ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.