Corona Virus: దేశంలో కొత్త‌గా 13,788 మందికి కరోనా నిర్ధారణ

13788 Fresh Coronavirus Cases In India
షార్ట్స్‌లో చూడండి
దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 13,788 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,457 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 145 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,419 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,11,342 మంది కోలుకున్నారు. 2,08,012 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,70,93,036 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,48,168 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News