మోదీ, ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకర పోస్టు చేసినందుకు ఎల్ఎల్బీ విద్యార్థి సస్పెన్షన్.. అరెస్టు
- గోరఖ్‌పూర్ వర్సిటీలో ఘటన
- ఇకపై వర్సిటీలో అడుగు పెట్టకూడదని ఆదేశం
- దర్యాప్తునకు ఒక కమిటీని కూడా ఏర్పాటు
అరుణ్ కుమార్ ఇకపై వర్సిటీలో అడుగు పెట్టకూడదని చెప్పారు. ఆయన తీరుపై దర్యాప్తునకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. మోదీ, యోగి ఆదిథ్యనాథ్ ఢిల్లీలో కలిసిన నేపథ్యంలో ఓ ఫొటో బయటకు వచ్చింది. దీన్ని ఉద్దేశిస్తూ ఆ విద్యార్థి అభ్యంతరకర రీతిలో వీడియోను రూపొందించి పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ లేని కారణంగా వర్సిటీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.