పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో దిగుతున్నాం: శివసేన
- ఉద్ధవ్ థాకరేతో చర్చల అనంతరం ప్రకటించిన సంజయ్ రౌత్
- దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తున్న శివసేన
- ఇటీవల బీహార్ ఎన్నికల్లోనూ పోటీ
గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివసేన పోటీ చేసింది. అయితే, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 22 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ ఓట్లను రాబట్టుకోవడంలో పార్టీ ఘోరంగా విఫలమైంది. శివసేనకు 0.05 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇవి ‘నోటా’కు వచ్చిన ఓట్ల కంటే తక్కువ కావడం గమనార్హం. నోటాకు 1.68 శాతం ఓట్లు పోలయ్యాయి.