కాన్పు కోసం వస్తే గర్భమే రాలేదంటున్నారు... తిరుపతి ప్రసూతి ఆసుపత్రి వద్ద మహిళ వాగ్వాదం
- సూళ్లూరుపేట నుంచి కాన్పు కోసం వచ్చిన మహిళ
- ప్రసూతి ఆసుపత్రి వైద్యులతో వాగ్వాదం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన డాక్టర్లు
- ఆమె కడుపులో గాలి బుడగలు ఉన్నాయని వెల్లడి
- వాటినే ఆమె గర్భంగా భావించిందని వివరణ
మహిళకు వచ్చింది గర్భం కాదని, వైద్య పరీక్షలో గాలి బుడగలు ఉన్నట్టు నిర్ధారణ అయిందని వైద్యులు చెబుతున్నారు. కడుపులోని గాలి బుడగలను ఆ మహిళ గర్భంగా భావించిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అలిపిరి పోలీసులు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.