India: నాలుగో టెస్టులో కష్టాల్లో పడ్డ టీమిండియా!

Indian Cricket Team in Trouble in Fourth Test
షార్ట్స్‌లో చూడండి
బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న టీమిండియా కష్టాల్లో పడింది. నిన్న వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయిన మ్యాచ్, ఈ ఉదయం తిరిగి ప్రారంభం కాగా, ఇప్పటివరకూ ఐదు వికెట్లను ఇండియా నష్టపోయింది. టాప్ ఆర్డర్ మొత్తం పెవీలియన్ దారి పట్టడంతో, ప్రస్తుతం కీపర్ రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు.

భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 44, శుభమన్ గిల్ 7, ఛటేశ్వర్ పుజారా 25, అజింక్య రహానే 37, మయాంక్ అగర్వాల్ 38 పరుగులు చేసి అవుట్ కాగా, ప్రస్తుతం భారత స్కోరు 63 ఓవర్లలో 169/5.

ఆసీస్ బౌలర్లలో జోష్ హాజల్ వుడ్ కు రెండు, మిచెల్ స్టార్క్, పాట్ కుమిన్స్, నాథన్ లియాన్ లకు తలో వికెట్ లభించాయి. ఈ మ్యాచ్ మరో రెండు రోజులు మాత్రమే మిగిలివుండటంతో, డ్రా చేసుకోవడం ద్వారా, గతంలో గెలుచుకున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని తమతోనే ఉంచుకోవాలన్న వ్యూహంతో ఇండియా ఆడాల్సి వుంటుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, తొలి టెస్టును ఆస్ట్రేలియా, రెండో టెస్టును భారత్ గెలుచుకోగా, మూడవ టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లూ ఒక్కో విజయంతో సమానంగా ఉన్నాయి. బ్రిస్బేన్ మైదానంలో ఇంతవరకూ ఆస్ట్రేలియా ఓడిపోయిందే లేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఆసీస్ ఆటగాళ్లు, మిగతా ఐదు వికెట్లను తీయాలని శ్రమిస్తున్నారు.

Go Back to Shorts
India
Australia
Cricket
Test Match

More Telugu News