నిన్న లేని రాజకీయ కుట్ర ఇవాళ ఎలా వచ్చింది సార్?: సవాంగ్ పై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
- ఆలయాల ఘటనలపై డీజీపీ ప్రెస్ మీట్
- ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర అంటూ వ్యాఖ్యలు
- తీవ్రంగా స్పందించిన అచ్చెన్నాయుడు
- అంతలోనే మాట మార్చేశారు
- తాడేపల్లి కాంపౌండ్ తలంటిందా? అంటూ విమర్శలు
"డీజీపీ గారూ... ఖాకీ డ్రెస్ తీసేసి తాడేపల్లి కొంపలో బులుగు కండువా కప్పుకోవచ్చు కదా... ఎందుకీ డ్రామాలు!" అంటూ మండిపడ్డారు. నిన్న మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం ఘటనలు పిచ్చోళ్లు, దొంగలు, జంతువుల పనే అన్నారని, అంతలోనే మాట మార్చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. నిన్న లేని రాజకీయ కుట్ర ఇవాళ ఎలా వచ్చింది సార్? అంటూ నిలదీశారు. అంతలోనే తాడేపల్లి కాంపౌండ్ తలంటిందా? అంటూ ప్రశ్నించారు.