ముందు కరోనా వ్యాక్సినేషన్... పోలియో టీకాల కార్యక్రమం వాయిదా
- ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్
- జనవరి 19న జరగాల్సిన పల్స్ పోలియో
- ఈ నెల 31కి వాయిదా
- కరోనా వ్యాక్సిన్ పంపిణీ తొలి దశ ముగిసిన తర్వాతే పోలియో టీకాలు
కరోనా తొలి దశ వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత జనవరి 31న పోలియో టీకాల కార్యక్రమం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నారు. దేశంలో కొవిడ్ టీకా అందించాల్సి రావడం అత్యవసర విషయం కావడంతో ఆ కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు పోలియో టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది.