చలి పులికి భయపడి ఎల్ఏసీ నుంచి సైనికులను ఉపసంహరించుకున్న చైనా!
- భారత్ తో సరిహద్దుల్లో 50 వేలమందిని మోహరించిన చైనా
- ఎల్ఏసీ వద్ద బాగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
- పెరిగిన చలితో సైనికుల ఇబ్బంది
- ఇప్పటికే 10 వేల మంది ఉపసంహరణ
గతేడాది మార్చి-ఏప్రిల్ లో యావత్ ప్రపంచం కరోనాతో ముమ్మర పోరాటం సాగిస్తున్న వేళ డ్రాగన్ మాత్రం భారత్ తో సరిహద్దుల్లో 50 వేల మంది సైనికులను మోహరించింది. అయితే, ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో సైనికులను అక్కడ ఉంచడం శ్రేయస్కరం కాదని భావించిన చైనా ఉపసంహరించుకుంటోంది. చలికి తోడు, పెద్ద సంఖ్యలో సైనికుల నిర్వహణ కష్టసాధ్యం కావడంతో ఎవరి స్థావరాలకు వారిని పంపించివేస్తున్నట్టు తెలుస్తోంది.