యాదాద్రిలో రెండు పుష్కరణిలు... కింద 2500 మంది స్నానం చేసేలా లక్ష్మీ పుష్కరిణి!
- స్వామి కైంకర్యాల కోసం పైనుండే విష్ణు పుష్కరిణి
- కింద ఉన్న గండి చెరువే లక్ష్మి పుష్కరిణి
- భక్తుల స్నానాలకు ఏర్పాట్లు
కొండ దిగువన ఉండే పుష్కరిణిలో ఒకేసారి 2,500 మంది వరకూ భక్తులు స్నానాలు చేయవచ్చని వెల్లడించిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ గీతారెడ్డి, మహిళలు, పురుషులు, పిల్లల కోసం వేర్వేరు స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక్కడే జల్లు స్నానాలకు, దుస్తులను మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లను సైతం నిర్మిస్తున్నట్టు తెలిపారు.