జోరు పెంచుతున్న బీజేపీ .. కాసేపట్లో హైదరాబాదుకు రానున్న బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్
- ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న తరుణ్ చుగ్
- అనంతరం బోధన్ కు పయనం
- రేపు, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ లలో పర్యటన
నగరానికి చేరుకున్న వెంటనే బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం బోధన్ కు వెళ్లనున్నారు. నిజామాబాద్, డిచ్ పల్లి మీదుగా ఆయన బోధన్ చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు బోధన్ లో జరిగే సభకు హాజరవుతారు .
అలాగే, రేపు ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఖమ్మంలోని వీవీసీ ఫంక్షన్ హాల్లో మేధావులతో ఆయన భేటీకానున్నారు. అనంతరం బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలతో అంతర్గత సమావేశాలను నిర్వహిస్తారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇక 9వ తేదీన వరంగల్ లో ఆయన పర్యటన కొనసాగనుంది.