రెచ్చిపోయిన ట్రంప్ మద్దతుదారులు.. అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు.. మహిళ మృతి
- బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ సమావేశం
- క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లిన ట్రంప్ మద్దతుదారులు
- కాల్పులు, బాష్పవాయువు ప్రయోగం
- సంయమనం పాటించాలంటూ ట్రంప్ ట్వీట్
అయితే, బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తున్న ట్రంప్ మద్దతుదారులు నినాదాలు చేసుకుంటూ క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. ఆందోళనకారులపైకి పోలీసులు బాష్పవాయువును కూడా ప్రయోగించారు. కాల్పుల్లో ఓ మహిళ మెడలోకి తూటా దూసుకుపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
మరోవైపు, ఈ ఘర్షణతో బైడెన్ గెలుపును ధ్రువీకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. ట్రంప్ ఆదేశాలతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపు చేశాయి. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.